8 July, 2026 | 5:44 AM

బీ కేర్ ఫుల్.. పోలీస్ యాక్ట్ అమలు

30-09-2024 03:28 PM

మెదక్: మెదక్ జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని  (అక్టోబర్  01 వ తేది నుండి 31  వ తేదీ  వరకు) జిల్లా వ్యాప్తంగా 30,30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని మెదక్ జిల్లా ఎస్.పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లాలో ప్రజలు ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. అలాగే ప్రజా ధనాన్ని నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించారు.