18 August, 2026 | 1:15 AM

ఆద్యంతం ఎంగేజింగ్‌గా సాV3

18-08-2026 12:16 AM

సామ్రాట్, డీమోన్ పవన్, లిఖిత (రాను బొంబాయికి రాను సాంగ్ ఫేమ్) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సాV3’. లక్ష్మి కృష్ణ ఫిలింస్ బ్యానర్‌పై వీ విజయ నిర్మిస్తున్నారు. నటుడు, దర్శకుడు కృష్ణ మాయ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  మేకర్స్ ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ లాంఛ్ వేడుకలో పలువురు బిగ్‌బాస్ సెలబ్రిటీలు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో హీరో సామ్రాట్ మాట్లాడుతూ.. “వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమిది.

ప్రేక్షకులు ఇష్టపడతారని ఆశిస్తున్నా” అన్నారు. ‘ప్రేక్షకులందరినీ ఎంగేజ్ చేసే ఒక మంచి మూవీ ఇది’ అని మరో హీరో డీమోన్ పవన్ తెలిపారు. హీరోయిన్ లిఖిత మాట్లాడుతూ.. “ఈ కథ చెబుతున్నప్పుడే ఎలాగైనా ఈ సినిమాలో నటించాలి అనేంత ఇష్టం ఏర్పడింది. సినిమా ప్రారంభం నుంచి ఆఖరి వరకు పూర్తిగా ఎంగేజ్ చేసేలా ఉంటుంది” అని చెప్పింది. డైరెక్టర్ కృష్ణమాయ మాట్లాడుతూ.. “ఇది టీజర్ మాత్రమే సినిమాలో ఇంకా స్ట్రాంగ్ కంటెంట్ చూస్తారు.

త్వరలోనే మా చిత్రాన్ని రిలీజ్‌కు తీసుకొస్తాం” అన్నారు. ‘అందరి సపోర్ట్ తో ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని ప్రొడ్యూస్ చేయాలని కోరుకుంటున్నాన’ని నిర్మాత విజయ తెలిపారు. అన్నారు. ఈ కార్యక్రమంలో సింగర్ రాము రాథోడ్, నటీనటులు సంజయ్ తుమ్మ, హారిక, రీతు చౌదరి, నిర్మాత అశోక్‌కుమార్ పాల్గొన్నారు.