calender_icon.png 9 September, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానాస్పద స్థితిలో రైలు కింద పడి ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి

08-09-2025 09:17:44 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): అనుమానాస్పద స్థితిలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని రైలు కింద పడి మృతి చెందిన సంఘటన ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఘట్ కేసర్ మున్సిపల్ లోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్) 4వ సంవత్సరం చదువుతున్న హిత వర్షిణి ఇటీవల మూడు రోజుల పాటు సెలవుల పై ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం రాత్రి 9:15 గంటల ప్రాంతంలో రైలు కిందపడి చనిపోయి ఉండవచ్చని రైల్వే పోలీసులు తెలిపారు. సోమవారం ఉదయం ట్రాక్ పై విధులు నిర్వహిస్తున్న రైల్వే సిబ్బంది సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు పరిశీలించి పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇంజనీరింగ్ విద్యార్థి మృతి పై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.