08-09-2025 09:20:44 PM
వరంగల్,(విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని గ్రీన్ ఫీల్డ్ హైవే భూ బాధితుల సమస్యను వెంటనే పరిష్కరించాలని సోమవారం గ్రీవెన్స్ లో ఉన్న కలెక్టర్ సత్య శారదా దేవిని బాధిత రైతులతో కలిసి ఎర్రబెల్లి ప్రదీప్ రావు వినతి పత్రం అందించారు. అనంతరం ప్రదీప్ రావు మాట్లాడుతూ ఎన్నో అభ్యంతరాలు లేవనెత్తేటువంటి అలైన్మెంట్ ను మార్చాలని, రైతులు అనేకసార్లు విన్నవించుకున్నప్పటికీ సమస్య పరిష్కరించలేదన్నారు. ఆ ప్రాంతంలో సన్నకారు, చిన్నకారు రైతులు ఈ భూమి మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని, వారి యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కట్టించి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.