08-09-2025 09:15:30 PM
లక్షెట్టిపేట,(విజయక్రాంతి): 2025-26 విద్యా సంవత్సరానికిగాను మంచిర్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా సంతపురి కిషోర్ కుమార్ ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం లో కలెక్టర్ కుమార్ దీపక్, డీఈఓ యాదయ్య కిషోర్ కుమార్ ను సోమవారం సన్మానించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ.... ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికవడం చాలా సంతోషంగా ఉందన్నారు. నా ప్రతిభని గుర్తించి నాకు ఈ అవార్డును అందించిన జిల్లా కలెక్టర్ కు,డీఈఓ కు ధన్యవాదములు తెలుపారు. ఉపాధ్యాయుని గా ఇంకా మంచి సేవలు అందించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఎల్లవేళల కృషి చేస్తానని తెలిపారు.