ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలు
16-09-2026 | 10:15am
ముకరంపుర, సెప్టెంబర్ 16(విజయక్రాంతి): భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165 జన్మదిన సందర్భంగా కరీంనగర్ జిల్లా పరిషత్(Karimnagar Zilla Parishad) ఆవరణలో మంగళవారం పంచాయతీరాజ్ కరీంనగర్ రీజియన్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో ఘనంగా ఇంజనీర్స్ డే సెలబ్రేషన్స్ జరిగాయని పంచాయతీ రాజ్ డిప్లమా ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కట్ట విష్ణువర్ధన్ తెలిపారు. విశ్వేశ్వరయ్య విగ్రహానికి పంచాయతీరాజ్ ఇంజనీర్లు పూలమాల వేసి మోక్షగుండం విశ్వేశ్వరయ్య చేపట్టిన వివిధ రకాల ఇంజనీరింగ్ పనులపై వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎస్ ఇ ఎంజాయ్ రెహమాన్ తోపాటు వివిధ ఇంజనీర్లు పాల్గొన్నారు.