సరస్వతి ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఆంగ్లభాష సంబరాలు
అలంపూర్, మార్చి 1:ఎర్రవల్లి మండల కేంద్రంలోని సరస్వతి ఇంటర్నేషనల్ స్కూల్ (సిబిఎస్‌ఈ) నందు ఆదివారం ఆంగ్లభాష సంబరాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎంఈఓ అమీర్ పాషా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం చిన్నారులు చేసిన ఆంగ్ల ప్రదర్శన మరియు ఆంగ్లభాష ప్రాధాన్యతను తెలుపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పలు రకాల ఆక్టివిటీలను ఆంగ్ల భాషలో విద్యార్థులు వివరించడం వారి యొక్క నైపుణ్యాలను మెరుగుపరచడమేనని ఎంఈఓ అన్నారు.విద్యార్థులు ప్రత్యేకంగా రూపొందించిన రైల్వే జంక్షన్ నమూనా ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ,ఆంగ్ల రచయిత షేక్స్పియర్ రసించిన ద మర్చంట్ ఆఫ్ వెన్నిస్ వంటి తదితర కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి.ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనితసా గర్,పాఠశాల చైర్మన్ వీర గోవర్ధన్ రెడ్డి ,డైరెక్టర్ వీర శ్రీనివాస్ రెడ్డి, కస్పాండెంట్ మధు లిక రెడ్డి, సుధీర్ కుమార్, సంధ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




