16 April, 2026 | 11:59 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

యూరియా కోసం రోడ్డెక్కిన అన్నదాతలు

02-03-2026 12:29 AM

కల్వకుర్తి మార్చి1: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో యూరియా కొరతపై రై తులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ఆదివా రం స్థానిక ఆగ్రో సేవా కేంద్రంలో 200కు పైగా యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు వాట్సాప్ గ్రూప్ ద్వారా సమాచారం అందించారు. దీంతో రై తులు పెద్ద సంఖ్యలో దుకాణం వద్దకు చేరుకుని తమ ఫోన్లలో యాప్ ద్వారా బుకింగ్ చేసుకునేందుకు నిరీక్షించారు.

ఉదయం 10:30 గంటలకు యాప్ ఓపెన్ చేయగానే క్షణాల్లోనే బస్తాలు పూర్తిగా అమ్ముడైపోయినట్లు కనిపించడంతో రైతులు అవాక్క య్యారు. తమ ముందే యాప్ ఓపెన్ చేసి చూస్తుండగానే అన్ని బస్తాలు ఎలా అయిపోయాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రైతులు హైదరాబాద్ చౌరస్తాలో ర హదారిపై ఆందోళనకు దిగడంతో భారీగా వాహనాలు స్తంభించాయి. సమాచారం అం దుకున్న సీఐ నాగార్జున తన సిబ్బందితో అక్కడికి చేరుకుని రైతులతో చర్చించి పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం రైతులు ఆందోళన విరమించారు.