calender_icon.png 3 December, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలరించిన కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్

02-12-2025 02:04:03 AM

మూడో కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్ సోమవారం జరిగింది. న్యూఢిల్లీలోని కొరియా రిపబ్లిక్ రాయబార కార్యాలయం, కొరియన్ ఫిల్మ్ కౌన్సిల్ భాగస్వామ్యంతో హైదరాబాద్ లోని కొరియా కాన్సులేట్ జనరల్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ఈ వేడుకలో వివిధ జానర్లకు చెందిన కొరియన్ సినిమాలను ప్రదర్శించారు. ప్రముఖ కొరియన్ దర్శకుడు, నిర్మాత యూ ఇన్-షిక్ స్వయంగా హాజరై అభిమానులతో మీట్-అండ్-గ్రీట్, ఇంటరాక్టివ్ సెషన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-షిక్ మాట్లాడుతూ.. “ఇక్కడ కొంతమంది ప్రేక్షకులను కలిశాను.

నేను చేసిన సినిమాల గురించి వాళ్లు వివరంగా మాట్లాడటం ఆనందాన్నిచ్చింది. భవిష్యత్తులో తప్పకుండా ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం సినిమాలు నిర్మిస్తా” అని తెలిపారు. ‘భవిష్యత్తులో కల్చర్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగం లో కొరియా ఇండియా కొలాబరేషన్‌లో వర్క్ చేస్తాయని ఆశిస్తున్నాన’ని కొరియన్ యాక్టింగ్ అంబాసి డర్ చెప్పారు. ‘కల్చరల్‌గా ఇండియా, కొరియా మధ్య చాలా సారూప్యత ఉంటుంది. ఇండియా కొరియా కాంబోలో ప్రాజెక్టులు రావాలని కోరుకుంటున్నామ’ని  కొరియా గౌరవ కాన్సు ల్ జనరల్ సురేశ్ చుక్కపల్లి న్నారు.