calender_icon.png 3 December, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

#90S చిన్నోడి పాత్రకు కొనసాగింపు కథతో..

02-12-2025 02:05:11 AM

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కొత్త సినిమా ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంట గా నటిస్తున్న చిత్రంతో ‘90 స్’ వెబ్‌సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అజీమ్ మహమ్మద్ డీవోపీగా వ్యవహరిస్తున్నారు. మేకర్స్ సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ఆవిష్కరించారు.

ఈ వేడుకలో కథానాయకుడు ఆనంద్ దేవర కొండ మాట్లాడుతూ.. “90స్’ వెబ్‌సిరీస్ చాలా నచ్చింది. ఆదిత్య పాత్రలో నన్ను నేను చూసుకున్నా. అలాంటి ఆదిత్య పెద్దయ్యాక తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల లండన్‌కి వెళ్తే.. అక్కడ ఏం జరిగింది? ప్రేమకథ ఏంటి? వంటి అంశాలతో ఈ సినిమా ఉంటుంది. తెలుగులో పూర్తిస్థాయిలో రొమాంటిక్ కామెడీ సినిమాలు పెద్దగా రావడం లేదు. ఆ లోటుని భర్తీ చేసేలా ‘ఎపిక్’ సినిమా ఉంటుంది” అన్నారు.

వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. “హీరో పాత్రకు చాలామంది అబ్బాయిలు కనెక్ట్ అవుతారు. హీరోయిన్ పాత్రకూ ప్రాధాన్యత ఉంది. జీవితంలో మనం దాటి వచ్చిన చిన్నచిన్న అందమైన జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఉంటుందీ ఈ సినిమా” అన్నారు. దర్శకుడు ఆదిత్య హాసన్ మాట్లాడుతూ.. “మన చుట్టూ జరిగితే చిన్న కథలను తీసుకొని, అందంగా తెరపైకి తీసుకురావడం నాకు ఇష్టం. ‘ఎపిక్’ ఒక మధ్యతరగతి యువకుడి ప్రేమకథ” అన్నారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ అని ఎందుకు పెట్టామంటే.. ఇది మొదటి భాగం. దీనికి కొనసాగింపు కూడా ఉంటుంది. ‘90స్’ వెబ్‌సిరీస్ చూసి ఆదిత్య హాసన్‌తో ఓ సినిమా చేయానుకున్నాం. ఆయన ఈ రొమాంటిక్ కామెడీ కథ చెప్పగానే వెంటనే ముందుకెళ్లాం. నేను వ్యక్తిగతంగా ఈ తరహా చిత్రాలకు పెద్ద అభిమానిని” అన్నారు.