13-07-2025 12:53:04 AM
దీక్షిత్ శెట్టి హీరోగా, బృందా ఆచార్య హీరోయిన్‌గా అభిషేక్ ఎం దర్శకత్వంలో రూపొండుతున్న తెలుగు-, కన్నడ ద్విభాషా క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’. శ్రీదేవి ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై హెచ్‌కే ప్రకాశ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫస్ట్‌లుక్, ఫస్ట్ సింగిల్‌కు మంచి స్పందన వచ్చింది. శనివారం మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. బ్యాంక్ దోపిడీకి వెళ్లిన హీరో గ్యాంగ్‌కు అక్కడ రూ. 67 వేలు మాత్రమే దొరుకుతాయి. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారనే ఆసక్తి రేకెత్తించేలా టీజర్‌లో వినోదాత్మకంగా రూపొందించారు. దీక్షిత్ శెట్టి కామెడీ టైమింగ్ ఆకట్టుకుంది. దీక్షిత్‌తో బృందా కెమిస్ట్రీ ఆకర్షణీయంగా ఉంది. ఈ చిత్రానికి సం గీతం: జుధాన్ శ్యాండీ; డీవోపీ:అభిషేక్ జే;ఎడిటర్: తేజస్