calender_icon.png 13 July, 2025 | 11:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి

13-07-2025 02:05:56 PM

హైదరాబాద్: మేడిపల్లిలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై ఆదివారం దాడి జరిగింది. కవితపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు మేడిపల్లిలోని తీన్మార్‌ మల్లన్న కార్యాలయంపై దాడి చేసి కార్యాలయంలోని ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేశారు. ఉద్రిక్తతలను అదుపు చేసే ప్రయత్నంలో మల్లన్న భద్రతా సిబ్బంది ఐదు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఫలితంగా నిరసనకారులలో అనేక మంది గాయపడ్డంతో వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దీనితో స్థానిక నివాసితులలో ఉద్రిక్తత, భయాందోళనలు పెరిగాయి.

ఈ దాడి మలన్న సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసింది. ఈ సంఘటన తర్వాత మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకోని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. జర్నలిస్టు సంఘాలు మరియు ప్రజా సంస్థలు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, మీడియా సంస్థలను రక్షించడానికి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చాయి. ఈ సంఘటనపై తీన్మార్ మల్లన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మీడియా సంస్థలపై దాడులు రాష్ట్రంలో శాంతి భద్రతలను దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు. జాగృతి కార్యకర్త చర్యలను ఆయన ఖండిస్తూ, ఇటువంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని మలన్న పేర్కొన్నారు.