13-07-2025 01:54:43 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా 24 మంది మహిళలకు కేసీఆర్ కిట్లను ఆదిలాబాద్ జిల్లా, ముఖరా కే సర్పంచ్ గాడ్గే మీనాక్షి పంపిణీ చేశారు. జూలై 24వ తేదీన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని 18 నెలల కాంగ్రెస్ పాలనలో డెలివరీ అయిన 24 మంది మహిళలకు “గిఫ్ట్ ఏ స్మైల్”లో భాగంగా కేసీఆర్ కిట్లను పంపిణి చేశారు. ఈ సందర్భంగా గాడ్గే మీనాక్షి మాట్లాడుతూ... కేసీఆర్ బాలింతల కోసం మానవీయ కోణంలో ఆలోచించి డెలివరీ అయిన ప్రతి మహిళలకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కిట్లను పంపిణి చేసింది.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక డెలివరీ అయిన మహిళలకు కేసీఆర్ కిట్లను ఇవ్వడం బంద్ చేసి మహిళలకు రేవంత్ రెడ్డి మోసం చేశాడన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి అయిన ప్రతి మహిళకు కేసీఆర్ కిట్ ఇచ్చి ఆదుకున్న గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ అని, అదే మహిళలకు మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. పేద కుటుంబానికి చెందిన మహిళలకు డెలివరీ అయిన వెంటనే కేసీఆర్ కిట్ ఇచ్చి వాటిలో పుట్టిన పిల్లలకు కావాల్సిన అన్ని వస్తువులు ఉండేవని, డెలివరీ అయిన ప్రతి మహిళకు పుట్టిన పిల్లలకు కేసీఆర్ కిట్ ఇచ్చి గౌరవంగా ప్రభుత్వ వాహనంలో ఇంటికి పంపిన గొప్ప మనసు గల ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్లను బంద్ చేసి ప్రజలను మోసం చేసిందని, ముఖరా కే గ్రామంలో కాంగ్రెస్ పాలనలో 18 నెలల్లో 24 మంది మహిళలు డెలివరీ అయ్యారనీ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ముఖరా కే గ్రామంలో 24 మంది మహిళలకు “గిఫ్ట్ ఏ స్మైల్”లో భాగంగా కేసీఆర్ కిట్లను పంపిణి చేయడం జరిగిందని సర్పంచ్ గాడ్గే మీనాక్షి అన్నారు. ఇక నుంచి గ్రామంలో డెలివరీ అయిన ప్రతి మహిళకు “గిఫ్ట్ ఏ స్మైల్”లో భాగంగా కేసీఆర్ కిట్లను పంపిణి చేస్తామని సర్పంచ్ గాడ్గే మీనాక్షి అన్నారు.