ఉత్సాహంగా మారథాన్ టూకే రన్
19-05-2026 12:00 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),మే18: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ కార్యక్రమం సోమవారం మండల కేంద్రం అర్వపల్లి లో ఎంపీడీఓ పల్లపు ఝాన్సీ ఆధ్వర్యంలో పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్ నుండి అర్వపల్లి ప్రధాన చౌరస్తా వరకు నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు అధికారులు,ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ చురుకుగా, ఆరోగ్యంగా ఉండాలంటే రోజువారి పనుల్లో భాగంగా వ్యాయామం తప్పనిసరి అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు చిల్లంచర్ల విద్యాసాగర్, బింగి కృష్ణమూర్తి, ఎస్‌ఐ సైదులు, హెచ్‌ఎం శ్రీదేవి, సూపరిండెంట్ నరసింహరాజు, పీడీలు మల్లేష్,దాసయ్య,సైదులు నాయకులు మామిడి శ్రీను, సైదులు, మహారాజు పాల్గొన్నారు.






