calender_icon.png 19 January, 2026 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంచనాలు తారుమారు?

19-01-2026 12:19:11 AM

ఖర్చు పెట్టాం ఎవరిని నిలబెట్టలేని స్థితి లోకి కొన్ని వార్డులు? 

కొన్ని చోట్ల పతుల స్థానంలోకి సతుల ఎంట్రీ 

వనపర్తి, జనవరి 18 (విజయక్రాంతి): సంవత్సర కాలం నుండి ఎదురు చూస్తున్న తాజా మాజీ కౌన్సిలర్లు, గత మున్సిపాలిటీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ తో ఓడిపోయిన కౌన్సిలర్లు అభ్యర్థులు తాము గెలుస్తాం అంటూ ఇప్పటికే ఆయా వార్డులో ఖర్చును నీళ్లలా పెట్టిన ఆశావాహుల పరిస్థితి అంచనాలు కాస్త తారుమారు కావడంతో పెట్టుకు న్న ఆశలు అన్ని గంగలో పోసిన పన్నీరు లా మారిన పరిస్థితి వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో నెలకోంది. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా పడ్డాం, ముందర మురిసినమ్మ పండుగ ఎరుగదు అన్న సామెతలా వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో శనివారం వెలువడిన రిజర్వేషన్లు ఆశలు పెట్టుకున్న అభ్యర్థులకు నిరాశను మిగిల్చాయి. కాగా కొన్ని చోట్ల అధికార, ప్రతిపక్ష పార్టీలలో ఊహించని అభ్యర్థులు తెరమీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయా వా ర్డులో ప్రజలు చర్చించుకుంటున్నారు. 

ఖర్చు పెట్టాం ఎవరిని నిలబెట్టలేని స్థితిలోకి కొన్ని వార్డులు? 

మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి ఎంత ఖర్చు అయిన పరువాలేదు మనకు అనుకూలంగా రిజర్వేషన్లు వస్తాయి అన్న నమ్మకంతో ఇప్పటికే ఆయా వార్డులో గల ఆశావాహులు లక్షల్లో ఖర్చు పెట్టడం మొదలు పెట్టారు. కొన్ని చోట్ల ముగ్గుల ఫోటీలు, క్రికెట్ కప్ లు వంటి పలు కార్యక్రమాలు చెప్పట్టి ప్రజల ముందుకు రాగా మరి కొంతమంది మరొక అడుగు ముందుకు వేసి ఎవరిని పట్టుకుంటే ఎక్కువ ఓట్లు పడుతాయో అటువంటి వారికీ నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ, ఇ లా ఎలాంటి సందర్బం వచ్చిన రాకున్నా అడిగిందే తడువుగా విందు లను ఏర్పాటు చేసిన ఖర్చు పెట్టిన వారికీ అనుకోకుండా రిజర్వేషన్లు తారుమారు కావడంతో తమ ఇంటి నుండి ఎవరిని నిలబెట్టలేని పరిస్థితి ఏర్పడంతో ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు వృ ధాగా మారనుందా లేకపోతే వచ్చే అభ్యర్థి కి తాము సపోర్ట్ చేస్తాం ఇంత ఖర్చు పెట్టాం అవి ఇస్తే పూర్తి స్థాయిలో మా మద్దత్తు ఉంటుందని ఇప్పటికే పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. 

కొన్ని చోట్ల పతుల స్థానంలోకి సతుల ఎంట్రీ

మున్సిపాలిటీ రిజర్వేషన్లు ఊహలకు భిన్నంగా మారడంతో కొన్ని చోట్ల పతుల స్థానంలో సతుల ఎంట్రీ ఇస్తున్నారు. గత మున్సిపాలిటీ ఎన్నికల్లో ఫోటి చేసిన సతుల స్థానం లో నేడు పతులు ఫోటి చేయనున్నారు.