calender_icon.png 19 January, 2026 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమనీయం మల్లికార్జునస్వామి కల్యాణం పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి

19-01-2026 12:18:48 AM

మానకొండూర్, జనవరి 18 (విజయ క్రాంతి): మానకొండూరు నియోజకవర్గ పరిధిలోని గన్నేరువరం మండలం మైలారం గ్రామంలోని స్వయంభూ మల్లిఖార్జున స్వామి దేవాలయంలో ఆదివారం స్వామి వారి కల్యాణోత్సవం కమనీయంగా జరిగింది. ఈ కళ్యాణోత్సవానికి మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కల్యాణోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే వెంట గన్నేరువరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, పార్టీ నాయకులు దుడ్డు మల్లేశం, రాజు, పరుషరాములు, ఓదెలు, విలాసాగర్ కోటి, తిరుపతి, వడ్నాల నరసయ్య, యాస్వాడ తిరుపతి, అనంతరెడ్డి, మార్గం మల్లేశం, చంద్రయ్య, డాక్టర్ ఆంజనేయులు, రాజేశ్వరి, పురంశెట్టి బాలయ్య, గవ్వ వీరయ్య, ఉదయ్ రెడ్డి, కొమరయ్య తోపాటు పలువురు సర్పంచులు ఉన్నారు.