పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
ఏపీవో నాగభూషణం
శంకర్‌పల్లి : జూన్ 10( విజయ క్రాంతి ): పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని శంకర్ పల్లి మండల ఏపీవో నాగభూషణం పేర్కొన్నారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక లో భాగంగా బుధవారం మండలంలోని గోపులారం గ్రామంలో గ్రామసభను నిర్వహించారు. గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం వస్తున్నందున మురుగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యలపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు.
గ్రామంలోని మురుగు కాలువల మరమ్మతులను చేపట్టడంతో పాటు తడి పొడి చెత్త పై ప్రత్యేక అవగాహన కల్పించాలని అన్నారు. రైతులకు కూడా మునగకా యల తోటల పెంపకానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడంతోపాటు వాటి యొ క్క సంరక్షణ కోసం ఖర్చు అయ్యే డబ్బుల ను కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పా రు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పొడవు శ్రీనివాస్, మండల బిజెపి పార్టీ నాయకులు బయన్న, వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.






