క్షయ నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
గరిడేపల్లి,(విజయక్రాంతి): క్షయ వ్యాధి నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని గ్రామ సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ చంద్రయ్య అన్నారు.గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు నిక్షయి శిబిర్ (క్షయ వ్యాధి ) కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ వి నరేష్ మాట్లాడుతూ నిక్షయ్ శిబిర్ ప్రచారం అనేది భారతదేశాన్ని క్షయ రహిత దేశంగా మార్చే లక్ష్యం వేగవంతం చేయటానికి నిర్వహించే 100 రోజుల కార్యక్రమం అన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా సామూహికంగా క్షయనిర్ధారణ కొరకు స్పూటం పరీక్షలు, ఎక్సరే పరీక్ష సైట్ టీవీ ఇంజక్షన్ వేయడం జరుగుతుందని,ఈ యొక్కసైట్ టీవీ ఇంజక్షన్ ద్వారా వ్యక్తికి బ్యాక్టీరియా ఉన్నదా లేదా నిర్ధారించడం జరుగుతున్నది, X Ray పాజిటివ్ ఉంటే టిబి మందులు మా యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచితముగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నాగేశ్వరరావు, డాక్టర్ సంతోష్,సుష్మ, అశోక్ ,సిహెచ్ఓ తీగల నరసింహ,సూపర్వైజర్ అంజయ్య గౌడ్,వెంకటరమణ,స్టాఫ్ నర్స్ యశోద,ఏఎన్ఎం కవిత,అంజలి, పాల్గొన్నారు






