16 April, 2026 | 5:56 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

కూసుమంచి మండలంలో ఐదు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయండి

16-04-2026 04:21 PM

అధికారులకు వినతి చేసిన సీపీఎం నాయకులు

కూసుమంచి, ఏప్రిల్ 16(విజయ క్రాంతి): కూసుమంచి మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఐదు కేంద్రాలు ఏర్పాటు చేయాలని . మొక్కజొన్నల కౌలు రైతుల పంట ను ఎటువంటి ఆంక్షలు లేకుండా కాటాలు వేసి వారి అకౌంట్లో డబ్బులు వేయాలని. ఎకరానికి 25 కింటాలు మాత్రమే కొంటామని నిబంధనను ఎత్తివేసి ప్రతి రైతు పండించిన ప్రతి గింజను పూర్తిగా 45 క్వింటాళ్ల వరకుకొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి.ఖాళీ బస్తాలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలనీ తెలంగాణ రైతు సంఘం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మండల కేంద్రం లో జరిగిన మండల స్థాయి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అన్న కార్యక్రమంలో మెమోరాండం సమర్పించడం జరిగింది. మొక్కజొన్న పంట వేసి 5నెలలు అయింది .పంట నమోదు కార్యక్రమం జరిగి మూడు నెలలు అయింది .పంట వచ్చి నెల అయింది అయినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటం గాని సరిపడా బస్తాలను ఏర్పాటు చేయటం కానీ ఇంతవరకు చేయలేదు. కౌలు రైతులు ఉన్నారని వారు మెజార్టీగా ఉన్నారని తెలిసి కంప్యూటర్ చేయటంలో పూర్తి నిర్లక్ష్యం చేస్తుంది.

ఈరోజు 50% కౌలు రైతులను భూ యజమానులు వచ్చి సంతకాలు పెడితేనే కాటాలు వేస్తాం అనటం  రైతుల పట్ల ప్రభుత్వా నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. గత ప్రభుత్వం కౌలు రైతులను విస్మరించిందని విమర్శించిన ఈనాటి ప్రభుత్వం అదే తరహాలో కౌలు రైతులని మానసికంగా ఇబ్బంది పెడుతుంది. కౌలు రైతులకు ప్రభుత్వం ఎటువంటి సౌకర్యాలు కల్పించలేకపోయినప్పటికీ ప్రైవేటు వ్యక్తుల ద్వారా వడ్డీకి పెట్టుబడి  తీసుకొని వ్యవసాయం చేశారు. చిన్న సన్నకారు రైతులు తమకున్న ఒకటి రెండు ఎకరాలతో కుటుంబాల గడవటం కష్టంగా ఉండటంతో ఉన్న కొద్ది భూమితో పాటుగా ఒకటి నుండి 2ఎకరాలు కౌలు తీసుకొని పంటలు పండించారు. కౌలు రైతులని ఆదుకుంటానన్న ప్రభుత్వం వారు పండించిన పంటకు అనేక ఆంక్షలతోటి కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతుంది . కావున తక్షణమే కౌలు రైతుల పంటలను ఎటువంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తుంది. తుఫాన్ హెచ్చరికలు అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి

అలాగే మండలంలో వరి కొనుగోలు కేంద్రాలను పాక్షికంగా ప్రారంభించారు రిబ్బన్ కట్ చేశారు కానీ కాటాలు వేయటం మిల్లులు కేటాయించడం చేయకపోవడం తో రైతులు 15 రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు తక్షణమే వరి ధాన్యం కాటాలను ఎక్కువ కేంద్రాలలో ఎక్కువ హమాలీ ఖాతాలతోటి ప్రారంభించాలని కోరుతున్నాం ,మండలంలో వ్యవసాయ కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన 12, రూపాయల పథకాన్ని అమలు చేయాలి ఉపాధి హామీ కూలీలకు రెండుసార్లు ఫోటో దిగి విధానాన్ని ఎత్తివేయాలనల ఉపాధి హామీ కూలీలకు కనీస వేతన చట్టం అమలు చేయాలని ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ విషయంలో 30% రైతులకు అమలు కాలేదు .వీటిని అమలు చేయాలని చాలా చోట్ల సీసీ రోడ్లు వేసి రోడ్ల పక్కన గ్రావెల్ ఏకపోవటం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అమలు చేయాలి. భూభారతి చట్టాన్ని రైతులకు త్వరితంగా అందుబాటులో తీసుకొచ్చి పాస్ పుస్తకాల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి .డిమాండ్ చేస్తూ నివారణ సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కూసుపంచి మండల కార్యదర్శి తోటకూర రాజశేఖర్ తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు యడవెల్లి రమణారెడ్డి, గిరిజన సంఘం డివిజన్ కార్యదర్శి మాడు గన్యా నాయక్ .నాగేశ్వరరావు, మండల నాయకులు జువ్వాజి శీను ప్రసాద్ తదితరులు రైతు నాయకులు పాల్గొన్నారు