10 March, 2026 | 6:29 AM

పీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

07-03-2026 12:16 AM

ఆదేశాలు జారీ చేసిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్

హైదరాబాద్, మార్చి 6 (విజయక్రాంతి) : మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆ పార్టీ సీనియర్ నాయకురాలు ఎర్రబెల్లి స్వర్ణను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి స్వర్ణ 1985 నుంచి ఇప్పటీ వరకు కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. 2005 నుంచి 2010 వరకు వరంగల్ మేయర్‌గా పనిచేశారు. ప్రస్తుతం పీసీసీ ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా సునితారావు పని చేశారు.