రాజ్యసభ అభ్యర్థుల నామినేన్లు పరిశీలన
- స్వతంత్ర అభ్యర్థి సాయి నామినేషన్ తిరస్కరణ
- కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నిక ఏకగ్రీవమే
హైదరాబాద్, మార్చి 6 (విజయక్రాంతి) : రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా స్వంతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన సాయి అనే వ్యక్తి నామినేషన్ పత్రాలను ఎ న్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ బరిలో నిలిచిన అభ్యర్థులు అభిషేక్ మనుసింఘ్వి, వేం నరేందర్‌రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నెల 9వరకు నామినేషన్ విత్ డ్రా చేసుకోవడానికి గడు వు ఉంది.
వీహెచ్ నివాసానికి వేం నరేందర్‌రెడ్డి
పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు నివాసానికి రాజ్యసభ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్యసభ సీటు కోసం వీహెచ్‌తో పాటు మరో 16మంది సీరియస్‌గానే ట్రై చేశారు. చివరకు వేం నరేందర్‌రెడ్డిని పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసిన విషయం తెలిసిందే.నరేందర్‌రెడ్డిని వీహెచ్ సన్మానించారు.




