10-12-2025 02:43:58 AM
ఎల్బీనగర్ జోనల్ బీజేపీ కార్పొరేటర్లు
ఎల్బీనగర్, డిసెంబర్ 9 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఓటరు జాబితాలో తప్పులను సవరించాలని, అనర్హులను తొలిగిం చాలని బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఎలక్ట్రోలర్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎల్బీనగర్ నియోజకవర్గం ఇన్ చార్జి, మేడ్చల్ రూరల్ జిల్లా ప్రభారీ సామ రంగారెడ్డి మాట్లాడుతూ... ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఓట ర్ జాబితాలో భారీస్థాయిలో లోపాలు ఉన్నాయన్నారు. కొన్ని చోట్ల ఒకే ఇంటి చిరునామాపై 50కు పైగా ఓటర్లు ఉన్నారని, అర్హులైన చాలా మంది ఓటర్ల పేర్లు జాబితాలో లేరని తెలిపారు.
ఒకే ఇంటి నెంబర్ ఉన్న భార్యాభర్తల పేర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో నమోదైనట్లు చెప్పారు. ఓటరు కార్డును ఆధార్ కార్డుతో లింక్ లేకపోవడంతో అనర్హులు ఉన్నారని తెలిపారు. మర ణించిన వ్యక్తుల పేర్లు ఇప్పటికీ ఓటర్ జాబితాలో ఉండడం, వాటిని తొలగించే ప్రక్రియ సరైన విధంగా జరగడం లేదన్నారు. ఓటర్ల ఆధార్ కార్డును ఓటర్ కార్డుతో లింక్ కార్యక్రమాన్ని వేగవంతంగా నిర్వహించాలి, మరణించిన వారి పేర్లను వెంటనే జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు కళ్లెం నవజీవన్ రెడ్డి, చింతల అరుణా సురేందర్ యాదవ్, బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, నాయకోటి పవన్ కుమార్, బీజేపీ డివిజన్ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.