10-12-2025 02:44:12 AM
గాంధీభవన్‌లో నిర్వహించిన నాయకులు
హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలను గాంధీభవన్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ కట్ చేశారు. ఆ తర్వాత పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం, మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. సోనియాగాంధీ పట్టుదల, కృషితోనే తెలంగాణ కల సాకరమైందన్నారు. మెజర్టీ పార్లమెంట్ సభ్యులను యూపీఏ చైర్ పర్సన్‌గా ఒప్పించి ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేశారని తెలిపారు.
తెలంగాణ తల్లి.. సోనియా గాంధీ: మెట్టు సాయికుమార్
తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ అని, ఆమె తలుచుకోకుంటే రాష్ర్టమే లేదని ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. ‘తెలంగాణ తల్లి సోనియా గాంధీ. ఆమె కృషి, పట్టుదలతోనే రాష్ర్టం ఆవిర్భవించింది. మెజార్టీ పార్లమెంట్ సభ్యులను యూపీఏ చైర్ పర్సన్ గా ఒప్పించి రాష్ర్టం సాకారం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రెండేండ్లు పూర్తి చేసుకున్నం. గ్లోబల్ సమ్మిట్‌తో రాష్ట్రానికి పెట్టబడులు వచ్చే అవకాశం ఉంది. విశ్వనగరాల్లో హైదరాబాద్ ఒకటి ఉండాలన్నది సోనియా గాంధీ ఆకాంక్ష’ అని తెలిపారు. కాగా సాయికుమార్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.