calender_icon.png 12 December, 2025 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లపై చిత్తశుద్ధి చాటుకోవాలి

10-12-2025 02:42:41 AM

  1. రిజర్వేషన్లు అమలయే వరకు బీసీలు బలమైన ఉద్యమం చేపట్టాలి

తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య

తెలంగాణ బీసీ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా మేడల అభిలాష్ గౌడ్ నియామకం

ముషీరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలని  తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ ఎంపి ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు అయ్యేంతవరకు బీసీలంతా బలమైన ఉద్యమం చేపట్టాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ మేరకు మంగళవారం విద్యానగర్లోని బీసీ భవన్ లో తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్,  ఎంపీ ఆర్. కృష్ణయ్య ఆదేశాల మేర కు తెలంగాణ బీసీ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా మేడల అభిలాష్ గౌడును తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ నియమించారు.

మేడల అభిలాష్ గౌడ్ కు ఎంపీ ఆర్.  కృష్ణయ్య సమక్షంలో  ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం ఎంపీ ఆర్.  కృష్ణయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తా మని మాట ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు మాట తప్పిందని మండిపడ్డారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నికలు జరపాలన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని,  లేనిపక్షంలో భవిష్యత్తులో బీసీలు కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్తారన్నారు. నూతనంగా నియమితులైన తెలంగాణ బీసీ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మేడల అభిలాష్ గౌడ్ మాట్లాడుతూ బీసీల డిమాండ్ల సాధన కోసం ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో శక్తి వంచన లేకుండా పనిచేస్తానన్నారు. బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలను అనగదొక్కాలని చూస్తుందన్నారు. 

బీసీలతో పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతవుతాయని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షే మ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య జాతీయ కో-ఆర్డినేటర్ ర్యాగ అరుణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు గువ్వల భరత్ కుమార్,  వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ లకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు టి.  రాజకుమార్, చిక్కుడు బాలయ్య  తదితరులు పాల్గొన్నారు.