రగులుతున్న పశ్చిమాసియా
- అమెరికా పరస్పర దాడులు తీవ్రతరం
- చాబహార్ పోర్ట్‌పై అమెరికా దాడి, కంట్రోల్ టవర్ ధ్వంసం
- ఖతార్, కువైట్, బహ్రెయిన్‌లపై విరుచుకుపడుతున్న ఇరాన్
- జోర్డాన్‌లోని అమెరికా యుద్ధ విమానాలపై దాడులు చేశామన్న ఐఆర్జీసీ
- 24 గంటల్లో హోర్ముజ్ నుంచి ప్రయాణించింది మూడు నౌకలే
- అమెరికా సైనికులను ఊచకోత కోస్తాం ఇరాన్ ఎంపీ బెహ్నామ్ వార్నింగ్
టెహ్రాన్, జూలై 17: పశ్చిమాసియాలో అమెరికా మధ్య యుద్ధంతో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతు న్నాయి. రెండు దేశాల పరస్పర దాడులతో ఆ ప్రాంతం భగ్గుమంటోంది. ఇరాన్‌లోని పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా దాడులను కొనసాగిస్తుంది.
దీంతో నగరాల్లోని ఒక్కొక్కటిగా కీలక మార్గాలు మూసుకుపోతున్నాయి. దక్షిణ ప్రాంతంలోని అహ్వాజ్, ఖేష్మ్, దాష్తి, సిరిక్, బందర్ ఈ లెంగే, బందర్ అబ్బాస్‌లో అమెరికా బాంబుల వర్షం కురిపించింది. రోడ్డు, రైల్వే, ఏయిర్‌పోర్ట్ లాంటి కీలక రవాణాలపై అమెరికా దాడులతో నగరంలో తీవ్ర విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అమెరికా ఒప్పందం ముగిశాక గత ఏడు రోజుల్లో అమెరికా చేసిన దాడుల్లో ఇరాన్‌లో 38 మంది మృతి చెందగా, 400మందికి పైగా గాయపడ్డారని అధికారులు ప్రకటించారు.
మరోవైపు భారత్‌కు అత్యంత కీలకమైన చాబహార్ మారిటైమ్ కంట్రోల్ టవర్‌పై అమెరికా దాడికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఈ మార్గం భారత్ నుంచి అఫ్గానిస్తాన్, మధ్య ఆసియా దేశాలకు అత్యంత కీలకమైంది. ఈ దాడులను అమెరికా సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. అమెరికా చేస్తున్న దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఖతార్, బహ్రెయి న్‌లపై డ్రోన్‌లతో విరుచుకుపడుతుంది.
జోర్డాన్‌లోని అమెరికన్ రీ ఫ్యూయలింగ్, యుద్ధ విమానాలను ధ్వంసం చేసినట్లు ఇరాన్ వెల్లడించింది. తమ దేశంపై అమెరికా చేసిన దాడుల్లో గత మూడు రోజుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇందుకు ప్రతీకారంగానే యుద్ధ విమానాలను ధ్వంసం చేశామని ప్రకటించింది. జోర్డాన్ ప్రజలు అమెరికన్ల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఐఆర్జీసీ పిలుపునిచ్చింది. సిరియాలోని అమెరికా స్థావరంపై కూడా దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా పరస్పర దాడులతో పశ్చిమా సియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి.
హోర్ముజ్ జలసంధిలో నౌకల రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. గత వారం రోజుల్లో ఈ మార్గంలో కేవలం 13 నౌకలు మాత్రమే ప్రయాణించగా, నేడు కేవలం మూడు నౌకలు మాత్రమే ప్రయాణించడం పరిస్థితి తీవ్రతకి అద్దం పడుతుందని షిప్పింగ్ డేటా వెల్లడించింది. ఒమన్ తీరానికి 19 నాటికన్ మైళ్ల దూరంలో ఓ ట్యాంకర్‌పై దాడి జరిగినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ఏజెన్సీ వెల్లడించింది. గుర్తుతెలియని క్షిపణి నౌకను తాకిందని పేర్కొంది. నౌకలోని సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తుంది.
అమెరికా సైనికులను ఊచకోత కోస్తామని ఇరాన్ ఎంపీ బెహ్నామ్ సయీదీ హెచ్చరించారు. అమెరికా ఇరాన్ విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడిచేస్తే, బాబ్ అల్-మండేబ్ జలసంధిని మూసివేయడానికి సిద్ధంగా ఉండాలని ఇరాన్ యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులను హెచ్చరించింది. హోర్ముజ్ జలసంధిని బలవంతంగా తిరిగి తెరవాలని అనుకుంటే ట్రంప్ కల ఆయనతోపాటే సమాధి అవుతుందని ఖోమ్‌కు చెందిన ఇమామ్ మహమ్మద్ సయీదీ హెచ్చరించారు. అమెరికా దాడులు నిలిపివేస్తేనే జల సంధిని తెరుస్తామనిపేర్కొన్నారు. కాగా కువైట్‌లోని అనేక ప్రాంతా ల్లో ఇరాన్ దాడులు చేస్తుందని దీంతో విద్యుత్ ఉత్పాదక ప్లాం ట్లు దెబ్బతిన్నాయని కువైట్ ఆరోపించింది.






