18 July, 2026 | 1:49 AM

సర్ పత్రాలను అందజేసిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

18-07-2026 01:49 AM

నిర్మల్ జులై 17 ( విజయ క్రాంతి) ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్మల్ జి ల్లాలో నిర్వహిస్తున్న సర్ ఓటరు ఫారాలను మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం అధికారులకు అందజేశారు. నిర్మల్ మండలంలోని ఎల్ల పెళ్లి గ్రామంలో స్వగృహంలో సర్ పత్రాలను పూర్తి చేసి కుటుంబ సమేతంగా అధికారులకు అందించారు. సర్ ప్రక్రియను ప్రతి ఒక్కరు సద్వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అల్లుళ్ల సోదరుడు మురళీధర్ రెడ్డి సురేందర్ రెడ్డి ఎఫ్‌ఎసి చైర్మన్ ధర్మాజీ రాజేందర్ మండల పార్టీ అధ్యక్షులు పోలాస మల్లేష్ తదితరులు ఉన్నారు.