‘సౌత్ స్పెషల్’ వరి ట్రాక్టర్ ఆవిష్కరించిన ఎస్కార్ట్స్ కుబోటా
ముంబై, మార్చి 3: వ్యవసాయ యంత్రాలు మరియు నిర్మాణ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థ అయిన ఎస్కార్ట్స్ కుబోటా లిమిటెడ్ పవర్ ట్రాక్ శౌర్య పేరుతో కొత్త 'సౌత్ స్పెషల్' వరి ట్రాక్టర్ సిరీస్‌ను విడుదల చేసినట్లు ప్రకటించింది. ఈ సిరీస్‌లో 39 హెచ్‌పి నుండి 52 హెచ్‌పీ విభాగాలలో ఐదు వేర్వేరు రకాలను అందుబాటులోకి తెచ్చారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాలలోని వరి సాగు ప్రాంతాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొట్టమొదటి వరి మరియు మాగాణి ప్రత్యేక సిరీస్ ఇది. పవర్ ట్రాక్ బ్రాండ్ ద్వారా ఈ రకమైన ప్రత్యేక శ్రేణిని పరిచయం చేయడం ఇదే తొలిసారి. దీని ద్వారా కీలకమైన వ్యవసాయ యాంత్రీకరణ విభాగంలో కంపెనీ తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటోంది.
భారతదేశంలో ఎస్కార్ట్స్ కుబోటా సంస్థ... కుబోటా, ఫామ్‌ట్రాక్ మరియు పవర్‌ట్రాక్ అనే మూడు బ్రాండ్‌ల పేరుతో ట్రాక్టర్లను విక్రయిస్తోంది. ఇవి వరుసగా ప్రీమియం, ఎంట్రీ-ప్రీమియం మరియు వాల్యూ విభాగాల అవసరాలను తీరుస్తున్నాయి. వీటిలో పవర్‌ట్రాక్ బ్రాండ్ అనేది తక్కువ ఖర్చుతో కూడిన వాల్యూ మరియు మాస్ సెగ్మెంట్ విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
వరి సాగు అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ శౌర్య సిరీస్ ట్రాక్టర్లు బురద మరియు నీరు నిలిచిన మాగాణి పొలాల్లో ఎంతో సమర్థవంతంగా పనిచేస్తాయి. వీటిలోని కీలక భాగాలకు క్యాసెట్ రకం సీలింగ్ ఉండటం వల్ల పని సమయంలో నీరు లేదా బురద లోపలికి వెళ్లకుండా రక్షణ ఉంటుంది.
కేవలం 3.1 మీటర్ల తక్కువ టర్నింగ్ రేడియస్ కారణంగా వీటిని చిన్న మరియు మధ్య తరహా పొలాల్లో కూడా సులభంగా తిప్పవచ్చు. సాంకేతిక పరంగా చూస్తే ఇందులో 8 ఫార్వర్డ్ మరియు 2 రివర్స్ గేర్లతో కూడిన ఫుల్లీ కాన్స్టెంట్ మెష్ గేర్‌బాక్స్ ఉంది.
మాగాణిలో ఎక్కువ గంటలు పనిచేసే రైతులకు వీలుగా ఎత్తుగా ఉండే పర్ఫొరేటెడ్ ప్లాట్‌ఫారమ్, సురక్షితమైన వైరింగ్ మరియు జారిపోకుండా ఉండే యాంటీ-స్లిప్పరీ ప్యాడ్లతో కూడిన అడ్జస్టబుల్ స్లైడర్ సీటును కూడా ఈ శౌర్య మోడళ్లలో అందించారు.
ఎస్కార్ట్స్ కుబోటా తదుపరి దశ వృద్ధికి దక్షిణ భారత దేశం ఎంతో కీలకమని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నిఖిల్ నందా చెప్పారు. ఈ కొత్త శ్రేణి పరిచయం ద్వారా దక్షిణ భారత మార్కెట్లలోని వరి సాగు విభాగంలో తమ భాగస్వామ్యం మరింత బలపడుతుందని విశ్వసిస్తున్నట్లు హోల్ టైమ్ డైరెక్టర్ మరియు సీఎఫ్ఓ భరత్ మదన్ చెప్పారు. పవర్ ట్రాక్ శౌర్య ప్రత్యేకంగా మాగాణి సాగు కోసం రూపొందించబడిందని చీఫ్ ఆఫీసర్ , ట్రాక్టర్ బిజినెస్ డివిజన్ నీరజ్ మెహ్రా తెలిపారు.




