29 August, 2026 | 11:57 PM

ఈసెట్ ఫలితాలు విడుదల

21-05-2024 12:49 AM

95.86 శాతం మంది ఉత్తీర్ణత

జూన్ రెండో వారంలో కౌన్సెలింగ్ 

హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించే ఈసెట్ ఫలితాలు సోమవారం విడుద లయ్యాయి. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఈసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఈసెట్ కన్వీనర్ పీ చంద్రశేఖర్, వైస్ చైర్మన్లు వెంకటరమణ, మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, ఓయూ వీసీ రవీందర్ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 22,3౬౫ (95.86 శాతం) మంది విద్యార్థులు అర్హత సాధించారని ప్రకటించారు. బీఎస్సీ మ్యాథ్స్‌లో పెద్దపల్లికి చెందిన యాదగిరి, కెమికల్ ఇంజినీరింగ్‌లో మనోహర్ ఫస్ట్ ర్యాంక్‌లు సాధించారు. జూన్ రెండోవారంలో కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. 

అందుబాటులో 25,288 సీట్లు 

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో 2023 మిగిలిన సీట్లు, 2024 విద్యాసంవత్సరంలోని సీట్లను కలుపుకొని మొత్తం 25,288 సీట్లు ఉన్నాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. ఇందులో కన్వీనర్ కోటా సీట్లు 10,834 వరకు ఉన్నట్టు ప్రకటించారు.  జూన్‌లో అడ్మిషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని 

వెల్లడించారు.