సర్కారు ఆఫీసుల్లో అవినీతి జలగలు
21-05-2024 12:51 AM
ఒకేరోజు ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు
పట్టుబడిన వారిలో తహసీల్దార్, జూనియర్ అసిస్టెంట్, జీపీ సెక్రటరీ
విజయక్రాంతి, నెట్‌వర్క్ : ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉండి మెరుగైన సేవలు అందించాల్సిన ప్రభుత్వ అధికారులు వక్రమార్గం పట్టారు. విధి నిర్వహణలో భాగంగా చేయాల్సిన పనులకు లంచం డిమాండ్ చేశారు. కడుపు మండిన బాధితులు చేసేదేమీ లేక ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు పక్కాగా ప్లాన్ చేసి అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో తహసీల్దార్, జూనియర్ అసిస్టెంట్, జీపీ సెక్రటరీ ఉన్నారు. ఈ ఘటనలు సోమవారం హనుమకొండ, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వెలుగు చూశాయి.






