19-07-2025 12:50:42 AM
మంత్రి పొంగులేటికి టీఎన్టీయూసీ వినతి
బూర్గంపాడు జూలై 18 (విజయక్రాంతి):సారపాకలో ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని టీఎన్టీయూసీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం టిఎన్టియుసి అధ్యక్షులు కనకమేడల హరిప్రసాద్ ఐటీసీ గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. తొలుత పొంగులేటిని శాలువాతో ఘనంగా సత్కరించారు. మండలంలో రెండు ఎకరాలకు తగ్గకుండా స్థలం కేటాయిస్తే ఐటీసీ సంస్థతో మాట్లాడి ఈఎస్‌ఐ ఆసుపత్రి కట్టించేందుకు గుర్తింపు సంఘం బాధ్యత తీసుకుంటుందన్నారు.
ప్రస్తుతం ఉన్న ఈఎస్‌ఐ డిస్పెన్సరీలో వైద్యులు, మందులు అందుబాటులో ఉంచడంతో పాటు అంబులెన్స్ అంశాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కి ఆసుపత్రి కేటాయింపు విషయాన్ని చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావులతో పాటు టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి గాదె రామకోటిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు దుగ్గెంపూడి శేషిరెడ్డి పాల్గొన్నారు.