19-07-2025 12:52:20 AM
ఎర్రుపాలెం, జూలై 18 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులోరాజకీయ జోక్యం తగదని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని మండల సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. సిపిఎం పార్టీ జిల్లా సభ్యులు దివ్యల వీరయ్య.
సిపిఎం మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్ రావు శుక్రవారం నాడు భీమవరం గ్రామపంచాయతీ ఆఫీస్ నందు నిర్వహించిన ధర్నాలో సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో వారు పాల్గొని మాట్లాడారు, దివ్వెల వీరయ్య మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపులో మండలంలో ఇందిరమ్మ ఇండ్ల గ్రామ కమిటీల వారు అర్హులైన వారికి కాకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ లోని వారికి మాత్రమే కేటాయించడం అన్యాయమని, ఇందిరమ్మ గ్రామ కమిటీలను రద్దుచేసి అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అధికారులు ప్రేక్షక పాత్ర వహించారని పేర్కొన్నారు ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపులో అర్హులైన వారిని గ్రామసభల ద్వారా ఎంపిక చేయాలని పేర్కొన్నారు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ నాయకుల జోక్యం తగదని పేర్కొన్నారు రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్న ప్రతి వ్యక్తికి రేషన్ కార్డును ఇవ్వాలని కోరారు రేషన్ కార్డుల జారీలో కాంగ్రెస్ నాయకుల జోక్యం తగదని పేర్కొన్నారు.
18 నెలల కాంగ్రెస్ ప్రజాపాలనలో ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ పార్టీ మరిచిపోయింది అన్నారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను ఇవ్వాలని కోరారు ప్రజా పాలన అంటే సంక్షేమ పథకాలలో అనహర్హులను ఎంపిక చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు దీనివల్ల అర్హులైన పేదలకు ఇండ్లు దక్కలేదని పేర్కొన్నారు. అధికారులు జోక్యం చేసుకొని నిజమైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలన్నారు.