19-07-2025 12:48:09 AM
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు వేసి నిధులను కేటాయించాలి
భద్రాద్రి కొత్తగూడెం, జులై 18, (విజయక్రాంతి): కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.గణేష్ ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కళాశాలలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు పేద విద్యార్థులకు ప్రభుత్వం కళాశాలలపై దృష్టి సారించాలని, ’ కళాశాలలో సరైన మరుగుదొడ్లు, ప్రయోగశాలలు లేకపోవడం వల్ల విద్యార్థులు ప్రయోగాలకు దూరమవుతున్న పరిస్థితి కోల్పోతున్నారన్నారు. అందువల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకునే విద్యార్థులు వెనుకంజలో ఉంటున్నారని. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల గడుస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని కళాశాలలలో క్లాస్ రూమ్ లో ఫాన్స్, ప్రహరీగోడలు సరిగ్గా లేక విద్యార్థుల అవస్థలు పడుతున్నారన్నారు.
వర్షాకాల నేపథ్యంలో కళాశాలల భవనములు శిథిలావస్థలకు వచ్చాయని, సమస్యల వలయంగా మారుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదవక పోవడం అడ్మిషన్లు ఆశించిన మేరకు జరగకపోవడమే ప్రధాన కారణం అని అన్నారు. ఇప్పటికైనా జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నత అధికారి డి ఏ ఈ ఓ : హెచ్.వెంకటేశ్వర్లు’ స్పందించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెరుగైన విద్యను విద్యార్థులకు అందేలా చూడాలని ప్రభుత్వ కళాశాలల సమస్యలు పరిష్కరించాలని లేని యెడల పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వి. భార్గవ్. ఎం. రాహుల్.ౄ ప్రణయ్ మహేష్ జి.గీతాంజలి శైలు.తదితరులు పాల్గొన్నారు.