calender_icon.png 9 May, 2025 | 4:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌బీఐ ఆధ్వర్యంలో ఇంకుడుగుంతల ఏర్పాటు

09-05-2025 12:00:00 AM

రీజినల్ మేనేజర్ సత్యనారాయణ

భద్రాద్రి కొత్తగూడెం, మే 8 (విజయక్రాంతి) ః జిల్లాలో అవకాశం ఉన్న ప్రతి బ్యాంక్ బ్రాం లోనూ ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ సత్యనారాయణ అన్నారు. భూగర్భ జలాల పరిరక్షణకు ఈ ఇంకుడు గుంతలు ఎంతగానో ఉపయోగపడతాయని, నీటి వనరుల సంరక్షణ భావితరాలకు శ్రీరామ రక్ష అని ఆయన అన్నారు.

గురువారం ఎస్.బి.ఐ. రుద్రాంపూర్ బ్రాం లో ఇంకుడు గుంత తవ్వే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాం మేనేజర్ ఈశ్వర్ రావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి, హె.ఆర్. మేనేజర్ రాములు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.