calender_icon.png 9 May, 2025 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాములవారిని దర్శించుకున్న పొంగులేటి దంపతులు

09-05-2025 12:00:00 AM

భద్రాచలం, మే 8 (విజయక్రాంతి) ః తెలంగాణ రాష్ర్ట రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు పొంగిలేటి శ్రీనివాస్-మాధురి దంపతులు పెళ్లిరోజు సందర్భంగా గురువారం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి దంపతులకు అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు.

వేద పండితులు స్వామివారి సుప్రభాత సేవకు హాజరైన మంత్రివర్యులకు సుప్రభాత సేవతో పాటు గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి గోత్రనామాలతో పూజలు చేసి స్వామివారి పట్టు వస్త్రాలు తీర్థప్రసాదాలు అందించారు.

అనంతరం ఐటిసి గెస్ట్ హౌస్ లో పెళ్లి రోజు సందర్భంగా కేక్ కట్ చేసి మంత్రివర్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు మంత్రి దంపతులకు జ్ఞాపకను అందజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు  రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.