calender_icon.png 9 May, 2025 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాసమస్యల పరిష్కారం కోసం సీపీఎం ఆధ్వర్యంలో..

09-05-2025 12:00:00 AM

ఎంపీడీవో కార్యాలయం ముట్టడి

భద్రాద్రి కొత్తగూడెం, మే 8 (విజయక్రాంతి) ః పాల్వంచ మండల పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించి ఎంపీడీవో కార్యాలయం ముట్టడించారు.

ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో రాజకీయ జోక్యాన్ని నివారించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని,స్థానిక సమస్యలను పరిష్కరించాలని బండ్రిగుండ లో జరిగిన ఉపాధి హామీ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టి డబ్బులు రికవరీ చేయాలని మండలంలో ఉన్న వలస ఆదివాసీలకు పోడు భూములకు పట్టా లుఇవ్వాలని ఆదివాసీలకు కుల దృవీకరణ పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పాల్వంచ రూరల్  మండలంలో వందలాది మంది పేదలు ఎం.పీ.డీ.వో కార్యాలయం ముట్టడించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు ప్రసంగించారు ఈ కార్యక్రమంలోరాష్ర్ట కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, గారు పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ గారు పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన వెంకటేశ్వర్లు పార్టీ మండల కార్యదర్శి పాకాల వెంకట్రావు మండల కమిటీ సభ్యులు సర్ప నరేందర్ పాయం నరసింహారావు బుక్య లాలు కంట శ్రీను కంటే రాందాస్ పద్దం భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.