4 July, 2026 | 12:27 PM

ప్రమాదాలకు నిలయంగా ఎన్‌హెచ్ 65

12-06-2024 12:55 AM

అర్ధరాత్రి తర్వాతే ఎక్కువగా ప్రమాదాలు

వాహనాల సైడ్ పార్కింగ్‌తో ప్రమాద ఘంటికలు

హైవేపై చిమ్మచీకట్లు.. కనిపించని రేడియం స్టిక్కర్లు 

రోడ్డు ప్రమాదాలు నివారణకు చర్యలు కరువు

సంగారెడ్డి, జూన్ 11(విజయ క్రాంతి) : 65వ జాతీయ రహదారా పై అతివేగం, నిద్రమత్తులో వాహనాలు నడుపుతుండడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీ య రహదారిపై ఉన్న లోపలు  నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. జాతీయ రహదారి కర్ణాటక సరిహద్దు నుంచి సంగారెడ్డి వరకు టోల్ గేట్ నిర్వాహకులు నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు.

ప్రధానంగా రాత్రయితే జాతీయ రహదారిపై ఉన్న చౌరస్తా వద్ద ఎక్కడ లైట్లు లేకపోవడంతో అంధకారం అలుముకుని . చౌరస్తాల వద్ద దారి చూపించే రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయలేదు. జాతీయ రహదారి పై టోల్ గేటు పేరుతో కోట్లు వసూలు చేస్తున్న హైవే కాంట్రాక్టర్ ఎక్కడ సౌకర్యలు కలిపించడం లేదు. జాతీయ రహదారికి అనుకుని దాబా లు వందల్లో ఏర్పాటు చేయడంతో లారీలు, భారీ వాహనాలు, కారులు రోడ్డు పైనే నిలిపి ఉంచుతున్నారు. దీంతో రాత్రి సమయంలో చీకట్లో వాహనాలు కనిపించక నేరుగా వేగంగా వెళ్లి ఢీకొంటున్నాయి, రోడ్డు పక్కన వాహనాలు నిలిపివేయడంతో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న అధికారు నివారణ చర్యలు తీసుకోవడం లేదు. 

సంగారెడ్డి నుంచి రాష్ట్ర సరిహద్దు వరకు ప్రమాదాలు..

65వ జాతీయ రహదారి సంగారెడ్డి నుంచి తెలంగాణ రాష్ట్ర సరిహద్దు మాడ్గి శివారు వరకు ఉంది. సంగారెడ్డి నుంచి కర్ణాటక సరిహద్దు వరకు 70 కిల్లో మీటర్లు దూరం రోడ్డు ఉంటుంది. జనవరి నుంచి జూన్ 10 వరకు 20 మంది రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన్నట్లు అధికారులు తెలి పారు. రోడ్డు ప్రమాదంలో 30 మంది వరకు తీవ్ర గాయలు కావడం జరిగిందని వారు తెలిపారు.  సదాశివపేట పోలీసు స్టేషన్ పరిధిలోని నందికంది శివారులో అదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సంఘటన స్థలంలో మృతిచెందిన్నారు.

సోమవారం తెల్లవారు జామున జహీరాబాద్ మండలంలోని సత్వార్ శివారులో లారీ బొల్తా పడి డ్రైవర్, క్లీనర్‌కు తీవ్రగాయాలయ్యాయి. హైవే పై ఎక్కడికక్క డ వాహనాలు  నిలపకుండా హైవే పెట్రోలింగ్ పోలీసులు నివారించాలి. కానీ రాత్ర యితే పోలీసులు  కేవలం దాబాలు, హోటల్‌లో మకాం వేస్తున్నారు. జాతీయ రహ దారిపై పెట్రోలింగ్ మొక్కబడిగా సాగుతోంది. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమా దాలు జరిగే ప్రాంతాలను పోలీసులు బ్లాక్‌స్పాట్‌లుగా గుర్తించారు. బ్లాక్‌స్పాట్‌లుగా గుర్తించిన  చౌరస్తాలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు. 

కనిపించని విద్యుత్ దీపాలు

జాతీయ రహదారిపై ఉన్న చౌరస్తాలు, గ్రామాల వద్ద విద్యుత్తు దీపాలు, రెయిలింగ్, బారికేడ్లు ఏర్పాటు చేయలేదు. చౌరస్తాల వద్ద రహదారికి ఇరువైపులా రెయిలింగ్ లేకపోవడంతో లారీలు, ఆటోలు, కారులు, ట్రాక్టర్లు భారీ వాహనాలు నేరుగా హైవే పైకి రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్రామాలు, చౌరస్తాల వద్ద రోడ్డు దాటడానికి ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారిపై బ్లాక్ స్పాటు గుర్తించిన చోట వాహనల వేగంను నియంత్రించేందుకు స్పీడు బ్రేకర్లు, స్టాపర్లు లేకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి.