7 April, 2026 | 3:08 AM

ఎగ్గొట్టడం చెడగొట్టడం.. ఇదే కాంగ్రెస్ నైజం

07-04-2026 12:45 AM

ఉప్పల్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడం డివిజన్లోని అభివృద్ధి పనులను చెడగొట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని  గ్రేటర్ హైదరాబాద్ బిఆర్‌ఎస్ నాయకులు  సాయిజన్ శేఖర్ అన్నారు.

సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. తాము నిధులు తెచ్చి డివిజన్లోని అభివృద్ధి పనులను  శంకుస్థాపన చేస్తే స్థానిక కాంగ్రెస్ నాయకులు తమ ఏదో నిధులు తెచ్చినటు అభివృద్ధి పనుల వద్ద పాలాభిషేకాలు చేసుకోవడం గొప్పలు చెప్పుకోవడం  స్థానిక కాంగ్రెస్ నాయకులకు అలవాటుగా మారిందన్నారు.

రానున్న ఎన్నికల కోసం కాంగ్రెస్ నాయకులు ప్రజలను మభ్యపెట్టే పనులు మానుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు మల్లికార్జున గౌడ్, ముత్యంరెడ్డి, రామకృష్ణ భూపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ఎర్రం శ్రీనివాస్ రెడ్డి కట్ట బుచ్చన్న గౌడ్ పాల్గొన్నారు