7 April, 2026 | 3:03 AM

సమస్యలు పరిష్కరించాలి.. లేదంటే మెరుపు సమ్మె

07-04-2026 12:44 AM

ఎల్పీజీ గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ హెచ్చరిక

ముషీరాబాద్, ఏప్రిల్ 6(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని 600 గ్యాస్ ఏజెన్సీలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే వారం రోజులలో సమ్మె చేస్తామని ‘తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ ట్రేడింగ్’ అధ్యక్షుడు నకిరేకంటి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఈ మేరకు సోమ వారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఎల్పీజీ గ్యాస్ సరఫరా సజావుగా అందించాలని ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేస్తే ఆ ఉత్త ర్వులకు విరుద్ధంగా రాష్ట్రంలోని ఎల్పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ డీలర్స్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గ్యాస్ డెలివరీ బాయ్స్ చేత అక్రమంగా రేపిల్లింగ్ సిలిండర్ల సరఫరా చేయాలని వేధింపులకు పాల్పడుతున్నారని, గత 12 ఏళ్ల నుంచి రాష్ట్రంలో డెలివరీ బాయ్స్ గా పనిచేస్తున్న 60 వేల మందిలో ఏ ఒక్క కార్మికుడికి కార్మిక చట్టం ప్రకారం యాజమాన్యాలు జీతాలు, వసతులు కల్పించడం లేద న్నారు. డెలివరీ బాయ్స్‌ని స్థానిక రౌడీషీటర్లు, రాజకీయ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. 

సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సంబంధిత అధికారులతో రివ్యూ చేయించి పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో చామకూర రాజు, కె.వి.గౌడ్ గడ్డం సత్యనారాయణ, నల్ల లక్ష్మణ్, ఎం.డి.యూనిస్, బుర్ర చంద్రయ్య, పైసా నర్సింగ్, ఎర్రోళ్ల నర్సింగ్, అజయ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఫయీమ్, అశోక్, వెంకట్, రవి తదితరులు పాల్గొన్నారు.