16 April, 2026 | 4:04 PM

ఉప ఎన్నికైనా రసవత్తరమే!

19-10-2025 12:00 AM

 డాక్టర్ తిరునహరి శేషు :

శాసనసభ ఎన్నికల తరువాత రాష్ర్టంలో జరుగుతున్న రెండవ ఉప ఎన్నికపై రాష్ర్టవ్యాప్తంగా రాజకీయ వర్గాలలో ఆసక్తి నెలకొన్నది. జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మరణించటంతో కేంద్ర ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 11న ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 14న ఫలితాలు విడుదల చేయనున్నారు.

2023 తెలంగాణ రాష్ర్ట శాసనస భ ఎన్నికల తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గానికి బీఆర్‌ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించటంతో జరిగిన ఉప ఎన్నికలో అధికా ర కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే జూబ్లీహిల్స్‌కు జరుగుతున్న ఉప ఎన్నికలో అధి కార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ మరో ప్రతిపక్ష పార్టీ బీజేపీల మధ్య జరుగుతున్న త్రిముఖ పోరులో ఏ పార్టీ విజ యం సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారిం ది. బీఆర్‌ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా అనే అంశంపై రాష్ర్టవ్యా ప్తంగా జోరుగా చర్చ జరుగుతుంది. 

సానుభూతి ఫలిస్తుందా! 

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరుగుతున్న ఎన్నికగానే చూడాలి. 2023 తెలంగాణ రాష్ర్ట శాసనసభ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకున్న మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దివంగత గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకే  ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్‌ఎస్ అవకాశం ఇచ్చిన నేపథ్యంలో తన గెలుపుకి సానుభూతి ఎంత మేరకు పనిచేస్తుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

ఒక డివిజన్ స్థాయి సమావేశంలో అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత మాట్లాడే సందర్భంలో భర్త ప్రస్తావన తెస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే ఆ అంశాన్ని అధికార పార్టీకి చెందిన మంత్రులు కృత్రిమ ఏడు పు, సానుభూతి వేరు రాజకీయం వేరు అని వెటకారంగా మాట్లాడటం విమర్శల పాలవుతుంది. సానుభూతి గెలిపిస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సెంటిమెంటుని అవహేళన చేస్తే మాత్రం సునీత అవకాశాలు మెరుగుపడతాయనే చెప్పాలి.

తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన తర్వాత ఈ దశాబ్ద కాలంలో ఏడు శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగితే ఐదు ఉప ఎన్నికలు ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు మరణించటంతోనే జరిగాయి. నారాయణఖేడ్, పాలే రు, దుబ్బాక, నాగార్జునసాగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజక వర్గాలలో కుటుంబ సభ్యులే పోటీ చేసినా ఉపఎన్నికలో గెలవలేకపోయారు అంటే ఆ నియోజకవర్గాల్లో సెంటిమెంట్ అస్త్రం సానుభూతి పవనాలు ఎన్నికలలో గెలిపించలేకపోయినాయి.

ఒక్క నాగార్జునసాగ ర్‌లో మాత్రం కాంగ్రెస్ పార్టీ కురు వృద్ధుడుకే. జానారెడ్డిపై నోముల భగత్ విజయం సాధించటంతో సానుభూతి అస్త్రం పని చేసిందనే చెప్పాలి. జూబ్లీహిల్స్ లాంటి నగ ర నేపథ్యం ఉన్న నియోజకవర్గంలో సానుభూతి ఎంతవరకు పనిచేస్తుందో వేచి చూడాలి ఏదైనా నియోజకవర్గంలో అనుకోని పరిస్థితుల్లో ఎవరైనా శాసనసభ్యులు మరణిస్తే ఉప ఎన్నికలలో కుటుంబ సభ్యు లే పోటీ చేస్తుంటే వారిని ఏకగ్రీవంగా గెలిపించాలనే ప్రతిపాదన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పెట్టిన సంప్రదాయాన్ని తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ ఆ సంప్రదాయానికి తిలోదకాలు ఇవ్వటం కొసమెరుపు. 

గెలుపు ఎవరిది?

జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో మూడు పార్టీలు పోటీపడుతున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ల మధ్యనే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పాటైన 2009లో మా త్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి న పి.జనార్దన్ రెడ్డి కుమారుడు పి.విష్ణువర్ధన్ రెడ్డి గెలుపొందారు. కానీ తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు అయిన తర్వాత జరిగిన మూడు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశమే దక్కలేదు.

2023లో కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మహమ్మద్ అజారుద్దీన్ గట్టిపోటీ ఇచ్చినప్పటికీ గెలవలేకపోయారు. నియోజకవర్గం ఏర్పాటైన ప్పటి నుంచి మాగంటి గోపీనాథ్ 2014లో తెలుగుదేశం నుంచి 2018, 2023లో బీఆర్‌ఎస్ నుంచి గెలుపొంది హ్యాట్రిక్ విజ యం సాధించారు. మరొక ప్రధాన రాజకీ య పార్టీ బీజేపీకి నియోజకవర్గంలో రాష్ర్టం ఏర్పాటు అయిన తర్వాత ఒక్క పర్యాయం కూడా విజయం దక్కలేదు.

2023 శాసనసభ ఎన్నికల్లో 80 వేలకు పైచిలుకు ఓట్లు సాధించిన బీఆర్‌ఎస్ లోక్‌సభ సహా ఎన్నికల నాటికి సగానికి పైగా తన బలాన్ని కోల్పోయింది. కానీ బీజేపీ తన ఓట్లని 25 వేల నుంచి 64 వేల ఓట్లకు, కాంగ్రెస్ పార్టీ కూడా తన ఓట్లని 62 వేల నుంచి 89 వేల ఓట్లకు పెంచుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో సాధించి న ఓట్లని నిలబెట్టుకున్నా గెలుపు సాధించే అవకాశాలు ఉంటాయి.

ఉప ఎన్నికల ఫలితాలు సహజంగా అధికార పార్టీకి అనుకూ లంగా ఉంటాయి. 2023 సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ ఎన్నికల్లో మూడ వ స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీకి కనీ సం డిపాజిట్ కూడా దక్కలేదు. కానీ ఉప ఎన్నికలలో మాత్రం 13వేల ఓట్ల మెజార్టీ తో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ విజ యం సాధించారు. 

ప్రభావిత అంశాలు

ఎన్నికల్లో పార్టీల గెలుపు ఓటములను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. మైనార్టీల ఓట్లు, వివిధ సామాజిక వర్గాల ఓట్లు, సెటిలర్స్ ఓట్లు ప్రధానంగా జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితంపై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 3.92 లక్షల ఓట్లలో 96 వేల ముస్లిం మైనా ర్టీ ఓట్లు, రెండు లక్షలకుపైగా ఉన్న బీసీ సామాజిక వర్గాల ఓట్లు, 40 వేలు ఎస్సీ ఎస్టీల ఓట్లు, 36 వేల సెటిలర్స్ ఓట్లు ఫలితంలో నిర్ణయాత్మక పాత్ర పోషించబోతు న్నాయి.

గత శాసనసభ ఎన్నికల్లో మైనార్టీ ఓట్లు, సెటిలర్స్ ఓట్లు నాటి అధికార బీఆర్‌ఎస్ వైపు మొగ్గాయి. కానీ రాష్ర్టంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మైనార్టీ ఓట్లు అధికార పార్టీ వైపుకే మళ్లుతాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రా యం.ఈ నేపథ్యంలో ఫలితం కూడా మారే అవకాశం లేకపోలేదు. సామాజిక సమీకరణాలు కూడా ఫలితాలను ప్రభావితం చేస్తాయి.

రాష్ర్టంలో బీసీల కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా బీసీ అభ్యర్థిని నిలబెట్టడం పెద్ద సంఖ్యలో ఉన్న బీసీ సామాజిక వర్గం ఓట్లు ఫలితాన్ని తారుమారు చేస్తాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల తో పాటు జూబ్లీహిల్స్‌లో కూడా గత శాసనసభ ఎన్నికల్లో ఓటింగ్ 47 శాతానికి మిం చలేదు కాబట్టి ఓటింగ్ శాతంతో పాటు కొన్ని వర్గాల నుంచి ప్రభుత్వం పైన అసంతృప్తి వ్యక్తమవుతుంది.

అలాగే హైడ్రా లాంటి భయం కూడా స్థానిక ప్రజల్లో ఉన్న నేపథ్యంలో ఉప ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉన్నా రెండు పార్టీలే ప్రధానంగా ముఖాముఖి తలపడుతున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న మాగంటి సునీత ప్రచారంలో ముందు ఉన్నప్పటికీ బలమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.

కాంగ్రెస్ గెలిస్తే పాలనకి ప్రజామోదం లభించినట్లుగా, బీఆర్‌ఎస్ గెలిస్తే ప్రభుత్వ పాలనను ప్రజ లు వ్యతిరేకిస్తున్నట్లుగా పార్టీలు భవిష్యత్తులో ప్రచారం చేసుకుంటాయి. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లాగా జరగకూడదని ప్రజలు కోరుకుంటున్నారు. ఫలితం కోసం నవంబర్ 14 దాకా వేచి చూడక తప్పదు. ఇన్ని అంశాల మధ్య జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రసవత్తర పోరుగా మారిపోయింది.

 వ్యాసకర్త సెల్: 9885465877