calender_icon.png 12 February, 2026 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విడిపోయినా.. గ్రేటర్ నుంచే జీతాలు

12-02-2026 03:07:52 AM

  1. మూడు కార్పొరేషన్లలో మార్చి వరకు పాతపద్ధతే..

ఆన్‌లైన్ సేవలకు కొత్తగా మై సీఎంసీ, మై ఎంఎంసీ

ఏప్రిల్ 1 నుంచి స్వతంత్రంగా ఆర్థిక లావాదేవీలు

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్

హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): హైదరాబాద్ నగర పరిపాలనా సౌలభ్యం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ప్రభుత్వం మూడు ముక్క లు చేస్తూ.. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. అయితే, పాలనాపరంగా విడిపోయినప్పటికీ, ఆర్థిక నిర్వహణలో మాత్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు పాత బంధమే కొన సాగనుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025 -26 మార్చి 31తో ముగియనుంది. మధ్యలో విభజన జరిగినందున కొత్త బడ్జెట్ కేటాయింపులు, ట్రెజరీ మార్పులు సాంకేతికంగా సాధ్యం కావు. అందుకే, మార్చి నెలాఖరు వరకు మూ డు కార్పొరేషన్ల పరిధిలోని సిబ్బం ది, ఉద్యోగులందరికీ పాత జీహెచ్‌ఎంసీ నిధుల నుంచే వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి మూడు కార్పొరేషన్లు తమ సొంత నిధులతో స్వతంత్రంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తాయి. భవన నిర్మాణ అనుమ తుల విషయంలో ప్రభుత్వం కీలక సంస్కరణలు చేపట్టింది.

ఇకపై మూడు కార్పొరేషన్ల కమిషనర్ల అధికారం కేవలం 10 అంతస్తుల వరకే పరిమితం కానుంది. 11 అంతస్తులు అంతకంటే ఎక్కువ అంతస్తులు ఉండే భారీ భవనాల అనుమతులన్నీ ఇకపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి వెళ్తాయి. అయితే, దీనివల్ల స్థానిక కార్పొరేషన్లు ఆదాయం కోల్పోకుండా, హెచ్‌ఎండీఏ వసూ లు చేసే ఫీజులో 10 శాతం వాటాను ఆయా కార్పొరేషన్ల ఖజానాకు మళ్లించనున్నారు.

నగర ప్రజలకు డిజిటల్ సేవలు అందించే విధానంలోనూ మార్పులు వచ్చా యి. ఇప్పటివరకు ఉన్న మై జీహెచ్‌ఎంసీ యాప్ ఇకపై 680 చ.కి.మీ విస్తీర్ణంలోని కోర్ సిటీకి మాత్రమే పరిమితం కానుంది. సైబరాబాద్, మల్కాజిగిరి ప్రజల కోసం మై సీఎంసీ, మై ఎంఎంసీ పేరుతో కొత్త వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తు తం వీటిలో ఆస్తి పన్ను, జనన, మరణ ధవీకరణ పత్రాల వంటి సేవలు లభిస్తుండగా..

ఏప్రి ల్ 1 నుంచి అన్ని రకాల పౌర సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ వెల్లడించారు. కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుతో పాలనా యం త్రాంగంలోనూ మార్పులు జరిగాయి. మల్కాజిగిరి, సైబరాబాద్ జోన్లకు అదనపు కమిషనర్లుగా ఉన్న అధికారులను ఆయా కార్పొరేషన్లకు పూర్తిస్థాయి కమిషనర్లుగా ప్రభుత్వం నియమిం చింది. అలాగే, జాయింట్ కమిషనర్లుగా ఉన్నవారికి అదనపు కమిషనర్లుగా పదోన్నతి కల్పిస్తూ పాలనా పగ్గాలను అప్పగించారు.