3 April, 2026 | 2:28 PM

Breaking News

TRS పేరుతో కవిత పార్టీ..! పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు   •   మంగళపల్లిలో ‘నత్తనడక’న అభివృద్ధి పనులు   •   మహంకాళి అమ్మవారికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు   •   ఘనంగా దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలు   •   రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలు మృతి   •   కొండాపూర్‌లో డ్రగ్స్ కలకలం.. పబ్‌లో సినీనటి హేమ   •   బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ — అమ్మవారి జాతరకు వెళ్లొస్తూ ముగ్గురు దుర్మరణం   •   తూప్రాన్‌లో శ్రీరాముడి రథోత్సవం.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య వివాదం   •   దొడ్డి కొమరయ్య... నేటి ప్రజావ్యతిరేక పోరాటలకు స్పూర్తి: కేసీఆర్   •   బహుజన ఆత్మగౌరవ ప్రతీక దొడ్డి కొమురయ్య   •  

జీహెచ్‌ఎంసీ తరహాలోనే జలమండలి

12-02-2026 03:09 AM
  1. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి జోన్ల ఏర్పాటు

జాయింట్ ఎండీగా మయాంక్ మిట్టల్.. ముగ్గురు ఈడీల నియామకం

బాధ్యతలు స్వీకరించిన అధికారులు.. ఎండీ అశోక్‌రెడ్డితో భేటీ

హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): నగర పాలనలో చోటుచేసు కున్న మార్పులకు అనుగుణంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లు అండ్ సూవరేజ్ బోర్డు (జలమండలి)ను మూడు ప్రధాన జోన్లుగా పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ తరహాలోనే జలమండలిని హైదరాబాద్, సైబ రాబాద్, మల్కాజిగిరి జోన్లుగా విభజించా రు. ఔటర్ రింగ్ రోడ్ వరకు నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, పౌర సేవలను మరింత చేరువ చేసేందుకు ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.

ఇందులో భాగంగా గతం లో ఉన్న జోన్లను సర్కిళ్లుగా, సర్కిళ్లను సబ్ డివిజన్లుగా, వార్డులను సెక్షన్లుగా మార్పు చేశారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో నీటి సరఫరా, డ్రైనేజీ సమస్యల పరిష్కారంలో వేగం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. పునర్వ్యవ స్థీకరణలో భాగంగా జలమండలిలో కీలక అధికారులను ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు ఈడీగా పనిచేసిన మయాంక్ మిట్టల్ పదోన్నతి పొంది జాయింట్ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. కొత్తగా ఏర్పడిన మూడు జోన్లకు ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను ప్రభుత్వం కేటాయించింది.

హైదరాబాద్ జోన్ సెంట్రల్‌కు సామ్రాట్ అశోక్‌ను, సైబరాబాద్ జోన్‌కు సంతోష్‌ను, మల్కాజిగిరి జోన్‌కు పంకజను నియమించారు. అయితే ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో బుధవారం కొత్త జాయింట్ ఎండీ మయాంక్ మిట్టల్ తో పాటు ముగ్గురు ఈడీలు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

అనంత రం వారు జలమండలి ఎండీ అశోక్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎండీ వారికి శుభా కాంక్షలు తెలుపుతూ, విస్తరించిన నగర పరిధిలో వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ డైరెక్టర్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.