9 August, 2026 | 7:52 AM

భవనం లేకున్నా.. బడికి అనుమతి

20-06-2024 02:16 AM
  • డీఈవోకు బీఎస్పీ, కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు 

అబ్దుల్లాపూర్‌మెట్, జూన్ 19: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గౌరెల్లి గ్రామ పరిధిలో పాఠశాల భవన నిర్మాణం పూర్తి చేయకుండానే నిర్వహణకు రివర్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం అక్రమంగా అనుమతులు పొందారని బీఎస్పీ నాయకులు ఆరోపించారు. భవనాన్ని పరిశీలించకుండానే మండల విద్యాధికారి స్కూల్ నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని ఆరోపించారు. దీంతో స్కూల్ యాజమాన్యం పాఠశాల బ్రోచర్ చూపించి అడ్మిషన్లు తీసుకుంటున్నారని తెలిపారు. ఎంఈవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీఎస్పీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షుడు గ్యార మల్లేశ్ ఆధ్వర్యంలో డీఈవో సుశీంద్రరావుకు ఫిర్యాదు చేశారు. డీఈవోను కలిసినవారిలో బీఎస్పీ మండలాధ్యక్షుడు చిత్రం కృష్ణ, కా్రంగెస్ నాయకులు చెంచల ధన్‌రాజ్, చెంచల చిరంజీవి, బంగారి మైసయ్య తదితరులు పాల్గొన్నారు.