డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం
20-06-2024 02:05 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 19(విజయక్రాంతి): డ్రగ్స్ రహిత సమాజమే పోలీసుల లక్ష్యమని, డ్రగ్స్‌పై పోరాటంలో యువత పాల్గొనాలని రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి అన్నారు. ఏటా జూన్ 26న నిర్వహించే అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినం పోస్టర్‌ను బుధవారం నేరేడ్‌మెట్‌లోని సీపీ కార్యాల యంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత డ్రగ్స్ మాయలో పడి తమ జీవితాలను వృథా చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్ వినియోగానికి యువత దూరంగా ఉండాలని, డ్రగ్స్ సరఫరా సమాచారం తెలిస్తే పోలీసులకు చెప్పాలని కోరారు. కార్యక్రమంలో డీసీపీ క్రైమ్స్ అరవింద్‌బాబు, డీసీపీ ఎస్బీ కరుణాకర్, ఏసీపీ ఐటీ సెల్ నరేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






