9 August, 2026 | 6:38 AM

ప్రజా సమస్యలను పరిష్కరిస్తా

20-06-2024 02:18 AM
  • మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్

కూకట్‌పల్లి, జూన్ 19: ఎన్ని సమస్యలు వచ్చినా నిత్యం ప్రజల మధ్యనే ఉంటానని, ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురు ముఖ్య నాయకులను ఆయన కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా నాయకులు ఈటలను సన్మానించారు. మల్కాజ్‌గిరి చరిత్రలో నిలిచిపోయే విధంగా గొప్ప మెజార్టీని అందించిన ప్రజలకు రుణపడి ఉంటానని ఈటల అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరారవు, మాధవరం కాంతారావు, మూసాపేట కార్పొరేటర్ కోడిచెర్ల మహేందర్, ప్రీతంరెడ్డి, లక్ష్మీకళ్యాణ్ పాల్గొన్నారు. 

జీహెచ్‌ఎంసీలో కార్పొరేషన్లను విలీనం చేయొద్దు

మహేశ్వరం, జూన్ 19: జీహెచ్‌ఎంసీలో మున్సిపల్ కార్పొరేషన్లు విలీనం చేసే ప్రతిపాదనను సర్కార్ విరమించుకోవాలని మహేశ్వరం నియోజకర్గ బీజేపీ ఇన్‌చార్జి అందెల శ్రీరాములుయాదవ్ కోరారు. బుధవారం తుక్కుగూడ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కాంటేకర్ మధుమోహన్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తుక్కుగూడ మున్సిపల్ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తుళ్ల వీరేందర్‌గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్‌రెడ్డి, ఫ్లోర్ లీడర్ శివకుమార్‌గౌడ్ పాల్గొన్నారు.