30 August, 2026 | 6:27 AM

పన్నులు చెల్లిస్తున్నా.. సదుపాయాలు కల్పించలేరా?

20-05-2024 02:29 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ ప్రజలు సకాలం లో పన్నులు చెల్లిస్తున్నప్పటికీ, యంత్రాంగం తగిన సదుపాయాలను కల్పించడంలో విఫలమవుతున్నని ఫోరం ఫర్ గుడ్ గవర్నర్స్ అధ్యక్షుడు ఎం. పద్మనాభరెడ్డి ఆదివారం జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్‌కు లేఖ రాసి మీడియాకు విడుదల చేశారు.  ఇటీవల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని, రుతు పవనాలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రీ మాన్‌సూన్ పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలన్నారు.

ఏటా ఏడాది చివరలో చెల్లిం చాల్సిన ఆస్తి పన్నును ఎర్లీ బర్డ్ పథకంలో భాగంగా ముందే చెల్లిస్తున్నారన్నారు. చిన్న వర్షాలకు నాలాలు పొంగి, రహదారుల్లో మోకాలు లోతులో వరద నిలిచిపోవడం బాధాకరమన్నారు. ఎస్‌ఎన్డీపీ ప్రాజెక్ట్‌లో భాగంగా మొదటి దశ నాలా పనులు రూ. 985 కోట్ల వ్యయంతో పూర్తయ్యాయని, అధికారులు వెంటనే రెండో దశ పనులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.