6 June, 2026 | 2:45 AM

సీఎంఆర్‌ఎఫ్ నిరుపేదలకు వరం

06-06-2026 01:25 AM

కాంగ్రెస్ నాయకులు ప్రకాష్ రెడ్డి

మేడ్చల్ అర్బన్ జూన్ 5(విజయక్రాంతి):ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరంలాంటిదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సద్ది ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణ పరిధిలోని శ్రీరంగవరం పట్టణానికి చెందిన మొండి రాధకు సిఎం రిలీఫ్ ఫండ్ 60 వేల రూపాయల చెక్కును అందజేసినట్లు చెప్పారు.

ఇటీవల రాధ భర్త మొండి వీరేశ్ అనారోగ్యం కారణంగా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ప్రకాష్ రెడ్డి తెలిపారు.వైద్య ఖర్చుల కింద మంజూరైన 60 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మృతుని భార్య రాధకు అందజేసినట్లు ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీరంగవరం వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బిక్షపతి.దుబ్బ బాలేష్.అనిల్.హాజిం.హమ్మద్ తదితరులు పాల్గొన్నారు..