15 June, 2026 | 2:05 PM

Breaking News

తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •  

మోసం చేస్తే పెద్ద సంస్థలైనా చర్యలు తప్పవు

30-12-2025 02:06 AM

జిల్లా వినియోగదారుల కమిషన్ జడ్జి నారాయణరెడ్డి

ఆదిలాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాం తి) :  వినియోగదారుల హక్కులను కాలరాసే పెద్దపెద్ద సంస్థలపై సైతం కఠిన చర్యలు తప్పవని జిల్లా వినియోగదారుల కమిషన్ జడ్జి నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. అమెజాన్ వంటి సంస్థలు కోర్టు ఆదేశాలను పాటించకపోతే నాన్బెయిలబుల్ వారెంట్లు జారీ చేయ డం, జైలు శిక్ష విధించడం వంటి చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని వెల్లడించారు.

జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జిల్లా పౌర సరఫరాల శాఖ, జిల్లా వినియోగదారుల సంక్షే మ సంఘం ఆధ్వర్యంలో వినియోగదారుల చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వినియోగదారుల కమిషన్ జడ్జి నారాయణ రెడ్డి మాట్లాడుతూ... ఏ వస్తువు కొనుగోలు చేసినా నాణ్యత లోపాలు, ధరల మోసాలు, సేవల లోపాల వల్ల వినియోగదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని పేర్కొన్నారు.

రైతులు విత్తనాల్లో నాణ్యత లోపాలు, కల్తీ పురుగుల మందులు, బ్యాంకు చెక్కులు, బీమా సొమ్ము పొందడం లో సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇటువంటి మోసాల నుంచి బాధితు లను కాపాడేందుకు వినియోగదారుల ఫోరం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలువురు బాధితులు ఫోరాన్ని ఆశ్రయించి పరిహారం పొందినట్లు గుర్తు చేశారు.

వస్తువులు లేదా సేవల్లో లోపాలు ఉంటే వినియోగదారులు నేరుగా, న్యాయవాది ద్వారా లేదా వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదులపై ఛైర్మన్తో పాటు ఒక మహిళా సభ్యురాలు, ఒక పురుష సభ్యుడు విచారణ జరిపి తీర్పు ఇస్తారని చెప్పారు. జిల్లా కమిషన్ తీర్పుపై అసంతృప్తి ఉంటే రాష్ట్ర, జాతీయ కమిషన్లను కూడా ఆశ్రయించవచ్చని వివరించారు.

ఈ కార్యక్రమంలో డీఎస్‌ఓ నందిని, జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షులు, క్యాట్కో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎల్లుల సంతోష్, అధ్యక్షులు బోరేకర్ గంగారం, ప్రధాన కార్యదర్శి  వెంకట్ రెడ్డి, ఫోరం ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆడేపు మధు, అజ్జు ఖాన్, నరసయ్య, కుమ్మరి వెంకటేశ్వర్లు, విజయ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.