శాతవాహన అధికారులు మారుతున్నా హాస్టల్ స్థితిగతులు మారడం లేదు
కొత్తపల్లి, డిసెంబర్ 11(విజయక్రాంతి): శాతవాహన యూనివర్సిటీ ప్రారంభం అయినప్పటి నుండి ఇప్పటివరకు అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పటికీ అధికారులు, ప్రభుత్వాలు మారుతున్న కూడా సమస్యల పరిష్కారానికి ప్రభు త్వం చర్యలు శూన్యమని ఏబీవీపీ సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేష్ ఆరోపించారు. గతంలో యూనివర్సిటీకి నియామకాలు లేక నిధులు రాక రెగ్యులర్ విసి లేని కారణంగా అనేక ఇబ్బందులు పడి తే,ప్రస్తుతం రెగ్యులర్ విసి వచ్చిన తర్వాత కూడా హా స్టల్లో పరిస్థితి దయనీయంగా మారి కనీసం మౌలిక వసతులు మెరుగుపడలేదు.
నిత్యం హాస్టల్లో మెస్ చార్జీలు అవకతవకలు జరుగుతున్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నరని యూనివర్సిటీలో విసి , రిజిస్టర్, ప్రిన్సిపాల్ అధ్యా పక బృందం చీఫ్ వార్డెన్లు మారినప్పటికీ, బాయ్స్ హాస్టల్ వార్డెన్ మాత్రం స్వయానా యూనివర్సిటీ అధికారుల అండదండలతో మెస్ ను స్వంత కిచెన్ మార్చుకొని ఒక బార్ ను తలపించే విధంగా విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఇష్టారాజ్యంగా మారిన అధికారులు సంబంధం లేనట్టు ఉండడం చాలా బాధాకరమని,అదే విధంగా గ్రంథాలయంలో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.
కనీసం విద్యార్థులు చదువుకోవాలంటే లైబ్రరీని మూసివేస్తూ విద్యార్థులను పోటీ పరీక్షలకు విద్యార్థులను దూరం చేసే కుట్ర పూరిత చర్యకు యూనివర్సిటీ అధికారులు పూనుకున్నారు. కాబట్టి తక్షణమే యూనివర్సిటీ లో నెలకొన్న హాస్టల్ స్థితిగతులను మార్చాలని మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు, విసి చర్యలు తీసుకోవాలని,లేని పక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో ఉద్యమాలను చేస్తామనిహెచ్చరించారు.




