calender_icon.png 6 July, 2025 | 2:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్‌గాంధీ విధానాన్ని ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త అనుసరించాలి

13-06-2025 12:26:17 AM

పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు 

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): సామాజిక న్యాయాన్ని అ మలు చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పనిచేస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు కొనియా డారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీహర్‌లో పేద పిల్లలు చదువుతున్న హాస్టల్ విద్యార్థులతో కలిసి రాహుల్ భోజనం చేసి.. వాళ్ల సమస్యలు తెలుసుకున్నారని, ప్రధానికి లేఖ రాశారన్నారు.

రాహుల్ ఆలోచనను  ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త అనుసరించాలని, తానూ కూడా ఈ నెల 16వ తేదీన తన జన్మదినాన్ని పురస్కరిం చుకొని విద్యార్థులతో కలిసి భోజనం చేస్తానన్నారు. తాను రాష్ట్రంలోని ప్రభు త్వ హాస్టళ్లను సందర్శించి.. అక్కడేమై నా సమస్యలుంటే సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తానన్నారు.