15 April, 2026 | 12:37 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఇందిరమ్మ ఇండ్లను ప్రతిష్టాత్మకంగా నిర్మించాలి

13-06-2025 12:25 AM

ఎల్లారెడ్డి, జూన్ 12 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ప్రజలకు ఇండ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి ప్రజలకు నాణ్యమైన ఇల్లును అందించే విధంగా  పంచాయతీ కార్యదర్శి, సంబంధిత శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రకాష్ అన్నారు.

గురువారం ఎల్లారెడ్డి మండలంలోని మీసంపల్లి గ్రామంలో నిర్మాణమైతున్న ఇందిరమ్మ ఇల్లు ఎంపీడీవో ప్రకాష్ నేరుగా పరిశీలించారు. అనంతరం నిర్మాణం పట్ల లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం నేడు పాఠశాలలో ప్రారంభం అయినందున గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుల తీరును పరిశీలించి హాజరు పట్టికను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.